Sri Saila Veebhuti Lingeswara Trust
Contact : 9030005537
​9949555537
  • Home
  • About Trust
  • Pancha Mutts
    • Bheema Shankara Mutt
    • Ghanta Mutt
    • Rudraksha Mutt
    • Veebhuti Mutt
    • Sarangadhara Mutt
    • Veerabhadra Mutt
  • Need of Restoration
  • Donate
    • Estimated Cost
  • News
    • Videos
  • Photo Gallery
  • Contact Us
  • Home-Eng
  • Vision Of the Mission-Eng
    • Sri Saila Veebhuti Lingeswara Trust - Eng
  • Ghanta Mutt - Eng
    • Vibhuti Mutt - Eng
    • Rudraksha Mutt - Eng
    • Sarangadara Mutt - Eng
  • Brochures
  • Contact Us
  • Home - Kannada
  • Pancha Mutts - Kannada
  • ಘಂಟಾಮಠ
  • ಭಿಮಾಶಂಕರ ಮಠ
  • ಶ್ರೀ ವೀರಭದ್ರ ಮಠ
  • ವಿಭೂತಿ ಮಠ
  • ರುದ್ರಾಕ್ಷ ಮಠ
  • ಸಾರಂಗಧರ ಮಠ
  • sitemap

శ్రీ శైల క్షేత్రంలోని  అలనాటి  పంచ మఠాలు

తపోభూమి అయిన శ్రీశైలానికి దేశం నలుమూలల నుండి భక్తులేగాక సాధకులు కూడా వచ్చి ఇక్కడ ఆవాసముండేవారు.వారి కోసమే ఈ మఠాలు కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించబడి మంచి వెలుగొంది ఈనాడు శిధిలావస్థలో ఉన్నాయని ప్రభుత్వం వారు అధ్యయనం ద్వారా గ్రహించి వాటికి పూర్వ వైభవం తేవాలి అనే సత్సంకల్పంతో జి.వో.నంబరు:1287/ 17-12-2015 ద్వారా C.A కాజ లక్ష్మి నారాయణ , మేనేజింగ్ . ట్రస్టీ శ్రీ శైల విభూతి లింగేశ్వర ట్రస్ట్ వారికీ మిగిలి ఉన్న మఠాల పునర్నిర్మాణం , గుండాల పునరుద్ధరణ , ఈశ్వర దర్శనానికి వచ్చిన భక్తులకు ధ్యానానికి తగిన ఆసన వగైరా వసతులు , ఆహ్లాదకర (Land Scaping)  ఉద్యానవన నిశ్శబ్ద వాతావరణం కల్పించుటకు తగిన అనుమతులు ఇచ్చినారు.వారికి ప్రొఫెసర్.సత్యమూర్తి Conservation Expert , Reach Foundation  , చెన్నై మరియు  Krishna Architectsవగైరాల సహాయ సహకారాలు వారి అపార అనుభవాన్ని ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి వినియోగించాలి అని కోరగా వారు అంగీకరించినారు.వారు ఇప్పటికి అనేక పర్యాయములు మఠాలన్నింటిని దర్శించి పరిశీలించి వారి సంపూర్ణమైన నివేదికను సమర్పించినారు


శ్రీ శైలం లోని అలనాటి అనేక మఠాలలో నేడు శిధిలావస్థలో మిగిలి ఉన్న పంచ మఠాలు పునర్నిర్మాణము చేసి మన ప్రాచీన ఆధ్యాత్మిక వైభవాన్ని పునరుద్ధరించుదాం

              శ్రీ శైల విభూతి లింగేశ్వర ట్రస్ట్ వారితో చేతులు కలపండి ...  చారిత్రాత్మక పంచ మఠాల పునర్నిర్మాణం లో భాగంకండి ...  

ఘంటా మఠం
స్కాందపురాణంలో అనేకసార్లు ప్రస్తావించబడిన ఈ మఠం , ఇందుగల ఘంటాకుండము అతి ప్రాచీనమైనవి.దీనిని ఘంటా సిద్ధేశ్వరుడు మరియు అనేక మంది సిద్ధ పురుషులు ఆవాసముగా చేసికొని తపస్సును ఆచరించినారు.సప్తమాతృకలలో ఒకరైన కౌమారి అమ్మ వారికి ఇప్పటికి కూడా విశేషమైన పూజలు జరుగుట అరుదైన సంప్రదాయం.ఇక్కడి ఘంటా కుండములోని  నీతితో స్వామికి ఒక పర్వదినాన రాత్రంతా అభిషేకించిన వాయుగమన శక్తిని పొందవచ్చని పురాణాల ద్వారా తెలియుచున్నది.

​విభూతి మఠం ​


అలనాడు ఈ మఠంలో  గురువులు తమ శిష్యులకు విద్యాభ్యాసంతో పాటు ఆధ్యాత్మిక మరియు ఆత్మజ్ఞాన ప్రభోదాలు నిర్వహించేవారు.ఈ మఠంలో ప్రత్యేక ఆకర్షణగా ఒక పెద్ద నల్లరాతి పై చెక్కబడిన పాశుపత యంత్రం ఉండేది.ఒకప్పుడు ఈ యంత్రం పై ఉంచబడిన విభూతిని ధరించి ధ్యానసాధన చేయటకు దేశంలో నలుమూలల నుంచి సాధకులు ఇచ్చుటకు వచ్చేవారు 

​​రుద్రాక్ష మఠం 

శ్రీ శైల ప్రధాన ఆలయానికి సుమారు 1 కిలోమీటరు దూరంలో ఉన్నది . ఈ మఠంలో రుద్రాక్షమాల ధరింప బడినట్లుగా ఉన్న శివలింగానికి జటాఝూటం కూడా చూపబడి ఉన్నది . ఈ మఠంలో పది అడుగులు ఎత్తైన పుట్ట కింద భాగంలో ఇప్పటికి కూడా తపస్సులో ఉన్న సిద్ధపురుషుల దర్శనం కోసం దేశం నలుమూలల నుండి సాధకులు వచ్చి ఇచ్చట సాధన చేస్తూ ఉంటారు.కొంతమంది సాధకులకు సిద్ధపురుషుల దర్శన భాగ్యం కల్గినట్లు చెబుతూ వుంటారు 

సారంగధర మఠం 

ఈ మఠం కూడా ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.వివిధ కాలములలో ఎందఱో సిద్దపురుషులకు , శైవగురువులకు , ఆధ్యాత్మిక , సేవానిరతులకు ఈ మఠం నెలవై ఉండేది.శ్రీ శైల క్షేత్రంలోని సిద్ధ సంప్రదాయాన్ని తెలియజెప్పే బ్రాహ్మి లిపిలోని "సరసపరమాత్మా" అనే 7 వ శతాబ్ది నాటి శాసనం ఈ సారంగధర మఠానికి  సమీపంలోనే నేలపై గల బండపై చెక్కబడటం చెప్పుకోదగ్గ విశేషం.శ్రీశైలంలో లభించిన శాసనములలో ఈ సరసపరమాత్మ శాసనమే అత్యంత ప్రాచీనమైనది.    

జటా వీరభద్ర మఠం 

శ్రీ శైల క్షేత్రం ప్రసిద్ధ సిద్ధ క్షేత్రమైన కారణంగా ఈ మఠంలో అతిప్రాచీనమైన సిద్ధపురుషుల విగ్రహాలు ఉన్నాయి.వీరభద్రుని విగ్రహానికి ప్రక్కనే సిద్ధపురుషులు ప్రతిష్టించిన శివలింగం ఉన్నప్పటికీ ఈ మఠం శిధిలావస్థలో ఉన్న కారణం చేత , నిత్యపూజలకు నోచుకోక వెలవెలభోతున్నది  
Picture
Picture
Vibhuti Mutt
Picture
Rudraksha Mutt
Picture
Picture
Powered by Create your own unique website with customizable templates.